ఇసుక దోచుకునేది వైసీపీ నేతలే : అయ్యన్న

దిశ, విశాఖపట్నం: రాష్ట్రంలోని నదుల్లో ఇసుక లభ్యత అవసరమైనంత ఉన్నా… ఎక్కడా దొరకని పరిస్థితి నెలకొందని, అనధికారికంగా వైసీపీ నేతనే ఇసుకను దోచేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. మంగళవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇసుక డిపోల్లో ఉన్న ఇసుకంతా మాయమవుతుందని, స్థానిక ఎమ్మెల్యే వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. ముఖ్యంగా నర్సీపట్నం డివిజన్‌లో గనులశాఖ అధికారులు విచారణ చేయగా 2,500 టన్నులకు లెక్కలు లేవని తేలిందని వెల్లడించారు. నాయకులు చేసిన అవినీతి, దానిని […]

Update: 2020-11-10 07:11 GMT

దిశ, విశాఖపట్నం: రాష్ట్రంలోని నదుల్లో ఇసుక లభ్యత అవసరమైనంత ఉన్నా… ఎక్కడా దొరకని పరిస్థితి నెలకొందని, అనధికారికంగా వైసీపీ నేతనే ఇసుకను దోచేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. మంగళవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇసుక డిపోల్లో ఉన్న ఇసుకంతా మాయమవుతుందని, స్థానిక ఎమ్మెల్యే వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. ముఖ్యంగా నర్సీపట్నం డివిజన్‌లో గనులశాఖ అధికారులు విచారణ చేయగా 2,500 టన్నులకు లెక్కలు లేవని తేలిందని వెల్లడించారు. నాయకులు చేసిన అవినీతి, దానిని ప్రోత్సహించిన ఎమ్మెల్యే వల్ల ఈ ప్రాంతంలో ఇసుక లేకుండా పోయిందన్నారు. అధికారులు సహకారం వల్లే ఇదంతా జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దీనిని మైనింగ్ శాఖ అధికారులు, ప్రజలకు స్వయంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇంత అవినీతి జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వం, పూట గడుపుకోవడం కోసం ఎడ్లబండ్లు తోలుకునే వారిని పోలీసులు అడ్డగిస్తున్నారని మండిపడ్డారు. దళితుల భూములు లాక్కుని చెల్లింపులు లేకుండా చేస్తున్నారని, దీనికి ప్రధాన కారణం రెవెన్యూ అధికారులకు భాగస్వామ్యం ఉందన్నారు. దానికి తగ్గ ఆధారాలు తన దగ్గరున్నాయని తెలిపారు. అవన్నీ అవసరమైన సమయంలో బయట పెడతానని… ఇదేకాకుండా అనధికారికంగా విశాఖ జిల్లాలో క్వారీలు నిర్వహిస్తున్నా… రెవెన్యూ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని అయ్యన్న ఆరోపించారు.

Tags:    

Similar News