కొడుకును బావిలో తోసి.. తండ్రి పురుగుల మందు తాగి..
దిశ, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులతో అభం శుభం తెలియని 7 ఏండ్ల కుమారుడుని బావిలో పడేసి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను కలచి వేసింది. ఈ ఘటన ఆత్మకూరు(ఎస్) మండలం ఏనుబాముల గ్రామంలో చోటు చేసుకోగా కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్‌లో రాశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరకంటి రాంరెడ్డి(49) ఆత్మకూర్(ఎస్) మండలంలో వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం […]
దిశ, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులతో అభం శుభం తెలియని 7 ఏండ్ల కుమారుడుని బావిలో పడేసి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను కలచి వేసింది. ఈ ఘటన ఆత్మకూరు(ఎస్) మండలం ఏనుబాముల గ్రామంలో చోటు చేసుకోగా కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్‌లో రాశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరకంటి రాంరెడ్డి(49) ఆత్మకూర్(ఎస్) మండలంలో వ్యవసాయం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2008లో బంధువుల వివాహానికి వెళ్లివస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో భార్య మరణించింది. ఆ తరువాత చివ్వెంల మండలానికి చెందిన పద్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రేమ్ కరణ్ రెడ్డి(9), తనుజ్ రెడ్డి(7) ఇద్దరు కుమారులు ఉన్నారు.
గత కొంతకాలంగా రాంరెడ్డి మతిస్థిమిత్తం సరిగ్గా లేకపోవడంతో ఇంట్లో తరచుగా భార్యతో గొడవలు జరుగుతున్నాయి. వీటితో పాటు ఆర్దిక ఇబ్బందులు ఎక్కువ అవడంతో రాంరెడ్డి చిన్న కొడుకు తనుజ్ రెడ్డిని తీసుకుని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ముందుగా కుమారుడిని బావిలో తోసేశాడు. ఆ తరువాత రాంరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అటువైపు వెళ్తున్న స్థానికులు రాంరెడ్డి డెడ్‌బాడీని చూసి పోలీసులకు సమాచారం అందించారు. రాంరెడ్డి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. కొడుకు తనుజ్ రెడ్డి మృత దేహం కోసం బావిలో గాలించిన దొరకలేదు. సూర్యాపేట రూరల్ సీఐ విఠల్ రెడ్డి పర్యవేక్షణలో ఆత్మకూర్(ఎస్) ఎస్‌ఐ లింగం.. బాలుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు.