భారీగా ఇసుక డంపులు స్వాధీనం

అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 117 ట్రిప్పుల ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ తెలిపారు.

Update: 2024-12-24 13:18 GMT

దిశ, కథలాపూర్ : అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 117 ట్రిప్పుల ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ తెలిపారు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మేన గ్రామ శివారులో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక దందాను గుర్తించిన రెవెన్యూ అధికారులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

     బొమ్మేన నుండి గంభీర్పూర్ వెళ్లే మార్గంలో ఇసుకను అక్రమంగా నిల్వ ఉంచిన విషయం తెలుసుకున్న అధికారులు 117 ట్రిప్పుల ఇసుకను తహసీల్దార్ వినోద్ సీజ్ చేశారు. కాగా 87 ట్రిప్పులను వేలం వేయగా మేడిపల్లికి చెందిన కె. రాజు దక్కించుకున్నారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నగేష్, వీఆర్ఓ మురళి, ప్రశాంత్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. 


Similar News