మద్యం మత్తులో కన్నకూతురిని అలా చేసిన తండ్రి.. చివరికి ( వీడియో)

దిశ, వెబ్‌డెస్క్ : ఇంటిలో ఆడపిల్లను లక్ష్మి దేవితో పోలుస్తారు. ఇక కూతురిని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు ఏ తండ్రైనా.. అంతే కాకుండా కూతురు కూడా తల్లికంటే తండ్రినే ఎక్కువగా ఇష్టపడుతుంది. కానీ, కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కన్న కూతురిని దారుణంగా హింసించాడు. మద్యం మత్తులో కన్నతండ్రే కర్కోటుకుడిగా మారి నాలుగేళ్ల చిన్నారిని చితక బాదాడు. ఈ అమానుష ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. https://twitter.com/i/status/1440013089844330496 వివరాల్లోకి వెళ్లితే.. మెదక్‌ మునిసిపాలిటీలో నాగరాజు అనే […]

Update: 2021-09-21 01:25 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఇంటిలో ఆడపిల్లను లక్ష్మి దేవితో పోలుస్తారు. ఇక కూతురిని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు ఏ తండ్రైనా.. అంతే కాకుండా కూతురు కూడా తల్లికంటే తండ్రినే ఎక్కువగా ఇష్టపడుతుంది. కానీ, కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కన్న కూతురిని దారుణంగా హింసించాడు. మద్యం మత్తులో కన్నతండ్రే కర్కోటుకుడిగా మారి నాలుగేళ్ల చిన్నారిని చితక బాదాడు. ఈ అమానుష ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.

https://twitter.com/i/status/1440013089844330496

వివరాల్లోకి వెళ్లితే.. మెదక్‌ మునిసిపాలిటీలో నాగరాజు అనే వ్యక్తి ట్రాక్టర్‌ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతనికి ఒక కూతురు, మొదటి భార్య మరణించడంతో రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఇతను మద్యానికి బానిసై ఎప్పుడు తాగి ఇంటికి వస్తుంటాడు. అలాగే సోమవారం రాత్రి బాగా తాగి ఇంటికి వచ్చాడు. ఆ సమంయంలో పిన తల్లి పాపకు అన్నం తినిపిస్తుంది. అన్నం తినను అని కూమార్తె గగన శ్రీ మారం చేయడంతో ఆగ్రాహానికిలోనైన నాగరాజు మత్తులో ఓ పొడవాటి తాడును తీసుకుని చిన్నారిని చితక బాదాడు. అంతటితో ఆగకుండా చిన్నారిని ఒక చేత్తో గాల్లోకి లేపుతూ నేలపై కొట్టాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న భార్య చిరు నవ్వులు చిందుస్తుండడం విస్మయానికి గురి చేసింది. ఈ ఘటన చూసిన వారందరూ అసలు మానవత్వం అనేది ఉందా.. మానవత్వాన్ని మరిచి చేస్తున్న పనులతో అసలు వీరు మనుషులేనా అనే సందేహాన్ని కలిగిస్తున్నాయటున్నారు. ఇక ఈ సంఘటనను కొందరు వీడియో తీయడంతో ఇది కాస్త వైరల్‌గా మారి, చివరికి పోలీసుల చేతికి చిక్కింది. దీంతో తల్లిదండ్రులకు పోలీసులు గట్టిగా కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

Tags:    

Similar News