అవ్వే మాకు మత గ్రంధాలు : బొత్స
దిశ,విశాఖపట్నం: ప్రతీ అక్క, చెళ్లమ్మ లకు సొంతిల్లు కల్పించటమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులతో కలిసి బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు పట్టాలు అందజేసి మాట్లాడారు. ఎన్నికల ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి మొదటి మంత్రి వర్గ సమావేశంలో చెప్పారని గుర్తు చేశారు. ఎన్నికల హామీలు, నవరత్న పథకాలు […]
దిశ,విశాఖపట్నం: ప్రతీ అక్క, చెళ్లమ్మ లకు సొంతిల్లు కల్పించటమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులతో కలిసి బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు పట్టాలు అందజేసి మాట్లాడారు. ఎన్నికల ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి మొదటి మంత్రి వర్గ సమావేశంలో చెప్పారని గుర్తు చేశారు. ఎన్నికల హామీలు, నవరత్న పథకాలు పత్రాలే మనకు ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ అని చెప్పారని అన్నారు.
మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల్లో నేర్చడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. నవరత్నాలు పథకాల్లో ప్రతీ పేదవానికి సొంత ఇళ్ళు నిర్మించి ఇవ్వాలనే ఆయన సంకల్పం ఈ రోజు నెరవేరుస్తున్నారని తెలిపారు.