నో న్యూయర్.. నో క్రిస్ మస్..!

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికిప్పుడు మహమ్మరిని ఎదుర్కోవడానికి ప్రభుత్వానకి కనిపిస్తున్న ఏకైక మార్గం లాక్ డౌన్ . దాన్నే నెదర్లాండ్స్ ప్రభుత్వం ఎంచుకుంది. ప్రతిష్టాత్మకమైన క్రిస్ మస్ ను సైతం పక్కన పెట్టింది. పండగ రోజు మినహా మిగిలిన అన్ని రోజులు కఠినమైన ఆంక్షలు తప్పవు అని నెదర్లాండ్ కు చెందిన మంత్రి రుట్టే ప్రకటించారు. అంతే కాకుండా ఆదివరం నుంచే దేశ వ్యాప్తంగా ఆంక్షలు […]

Update: 2021-12-19 11:50 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికిప్పుడు మహమ్మరిని ఎదుర్కోవడానికి ప్రభుత్వానకి కనిపిస్తున్న ఏకైక మార్గం లాక్ డౌన్ . దాన్నే నెదర్లాండ్స్ ప్రభుత్వం ఎంచుకుంది. ప్రతిష్టాత్మకమైన క్రిస్ మస్ ను సైతం పక్కన పెట్టింది. పండగ రోజు మినహా మిగిలిన అన్ని రోజులు కఠినమైన ఆంక్షలు తప్పవు అని నెదర్లాండ్ కు చెందిన మంత్రి రుట్టే ప్రకటించారు.

అంతే కాకుండా ఆదివరం నుంచే దేశ వ్యాప్తంగా ఆంక్షలు అమలులో ఉంటాయని అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జానీ చేసింది. జనవరి 14 వరకూ అన్ని రకాల వినోద కేంద్రాలు, ఫాపులు, మాల్ లాంటివి అన్నీ మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక అన్ని విద్యా సంస్థలు సైతం మూసి వేస్తున్నట్టు ప్రకటించారు. జనవరి 9 తర్వాత పొడగింపు గురించి చెబుతాం అని రుట్టే తెలిపారు.

Tags:    

Similar News