మా ఉగ్రరూపం ప్రభుత్వం తట్టుకోలేదు.. సీపీఐ నేత స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామంలో నిర్మించబోతున్న సీతమ్మప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు చేపట్టిన రీలే నిరాహార దీక్ష 100 రోజులకు చేరుకుంది. శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు బొల్లోజు అయోధ్య నిర్వాసితులకు మద్దతు పలికి 100వ రోజు దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా అయోధ్య మాట్లాడుతూ.. భూ నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయకుండా ఇబ్బందులు పెట్టడం సరైందని కాదన్నారు. వందరోజులుగా నిర్వాసితులు న్యాయంకోసం దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి కనిపించడం […]
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామంలో నిర్మించబోతున్న సీతమ్మప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులు చేపట్టిన రీలే నిరాహార దీక్ష 100 రోజులకు చేరుకుంది. శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు బొల్లోజు అయోధ్య నిర్వాసితులకు మద్దతు పలికి 100వ రోజు దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా అయోధ్య మాట్లాడుతూ.. భూ నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేయకుండా ఇబ్బందులు పెట్టడం సరైందని కాదన్నారు. వందరోజులుగా నిర్వాసితులు న్యాయంకోసం దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై నమ్మకంతో ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములిస్తే, రైతుల పొట్టగొట్టడానికి ప్రయత్నం చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులపై అక్రమంగా పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు సీపీఐ అండగా ఉంటుందని దీక్ష సాక్షిగా హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం సీతమ్మ సాగర్ భూ నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే సీపీఐ ఉగ్రరూపానికి ప్రభుత్వం బలికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్, సీపీఎం జిల్లా నాయకులు అన్నవరపు సత్యనారాయణ, టీడీపీ మండల అధ్యక్షులు తుళ్లూరి ప్రకాష్, నాయకులు వెర్పుల మల్లిఖార్జున్, దంతాల జగదీష్, గద్దల శ్రీను, సాంబశివరావు, సంపత్, స్థానిక నిర్వాసితులు పాల్గొన్నారు.