సంగండెయిరీ: జీవోను నిలిపివేసిన హైకోర్టు

దిశ, వెబ్ డెస్క్ : సంగం డెయిరీ చైర్మెన్ దూళిపళ్ల నరేంద్ర కుమార్ అరెస్టైన తర్వాత డెయిరీని డెవలప్ మెంట్ కార్పోరేషన్ పరిధిలోకి తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. అయితే ఈ డెయిరీ కార్యకలపాల బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ కు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే సంగం డెయిరీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొస్తూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఆ సంస్థ డైరెక్టర్లు హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. […]

Update: 2021-05-07 02:16 GMT

దిశ, వెబ్ డెస్క్ : సంగం డెయిరీ చైర్మెన్ దూళిపళ్ల నరేంద్ర కుమార్ అరెస్టైన తర్వాత డెయిరీని డెవలప్ మెంట్ కార్పోరేషన్ పరిధిలోకి తీసుకొస్తూ ఏపీ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. అయితే ఈ డెయిరీ కార్యకలపాల బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ కు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే సంగం డెయిరీని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొస్తూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ ఆ సంస్థ డైరెక్టర్లు హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. సంగం డెయిరీని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటూ చేసిన జీవోను హైకోర్టు కొట్టవేసింది. సంగం డెయిరీ ఆస్తుల క్రయా విక్రయాలు కోర్టు ద్వారానే జరగాలనని హైకోర్టు తెలిపింది. డైరెక్టర్లు సాధార‌ణ కార్యక‌లాపాలు నిర్వహించుకోవ‌చ్చని తెలిపింది. అంతేకాదు, ఆ డెయిరీ స్థిర‌, చ‌రాస్తులు అమ్మాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల‌ని ఆదేశించింది. డెయిరీపై ఆధిపత్యం డైరెక్టర్లకే ఉంటుంద‌ని హైకోర్టు తెలిపింది.

Tags:    

Similar News