ట్రాక్టర్‌పై కలెక్టర్.. స్మశాన వాటికకు వెళ్లి..
దిశ, తాండూరు: రోడ్లన్నీ అధ్వానంగా మారడంతో అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులకు ఎక్కడో ఒకచోట ఇబ్బందులు తప్పడం లేదు. స్మశాన వాటికను పరిశీలించడానికి వెళ్ళిన కలెక్టర్‌కు సైతం అవస్థలు తప్పలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని సంగం కుర్దు గ్రామంలో స్మశాన వాటిక నిర్మాణం జరగలేదని తెలిసింది. దీంతో శుక్రవారం జిల్లా కలెక్టర్ పౌసుమిబసు పర్యవేక్షించడానికి బయల్దేరారు. తీరా చూసేసరికి అక్కడికి వాహనాలు వెళ్లడానికి వీలుకాకపోవడంతో.. పంచాయతీ కార్యదర్శి […]
దిశ, తాండూరు: రోడ్లన్నీ అధ్వానంగా మారడంతో అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులకు ఎక్కడో ఒకచోట ఇబ్బందులు తప్పడం లేదు. స్మశాన వాటికను పరిశీలించడానికి వెళ్ళిన కలెక్టర్‌కు సైతం అవస్థలు తప్పలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని సంగం కుర్దు గ్రామంలో స్మశాన వాటిక నిర్మాణం జరగలేదని తెలిసింది. దీంతో శుక్రవారం జిల్లా కలెక్టర్ పౌసుమిబసు పర్యవేక్షించడానికి బయల్దేరారు. తీరా చూసేసరికి అక్కడికి వాహనాలు వెళ్లడానికి వీలుకాకపోవడంతో.. పంచాయతీ కార్యదర్శి రవీందర్ ట్రాక్టర్‌ను ఏర్పాటు చేశారు.
దీంతో జిల్లా కలెక్టర్ పౌసుమిబసు ఏకంగా ట్రాక్టర్‌పై కూర్చొని వెళ్లి స్మశానవాటికను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పౌసుమిబసు మాట్లాడుతూ.. స్మశానవాటిక పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డంతా అధ్వానంగా మారడంతో నూతన రోడ్డు వేయడానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ గుంతలు పడి వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ట్రాక్టర్‌పై వెళ్లి కలెక్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఊరుబయటి శ్రీలత, పంచాయితీ కార్యదర్శి రవీందర్ తదితరులు ఉన్నారు.