పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా..
లగ చర్ల గ్రామంలో జరిగిన దాడి కేసులో ఏ 1 గా కొడంగల్ మాజీ
దిశ ప్రతినిధి, వికారాబాద్ : లగ చర్ల గ్రామంలో జరిగిన దాడి కేసులో ఏ 1 గా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా పడింది. నేడు బుధవారంతో కొడంగల్ కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ పూర్తయింది. దీంతో నరేందర్ రెడ్డి తరఫున న్యాయవాదులు వికారాబాద్ జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జిల్లా కోర్టు బెయిల్ పిటిషన్ ను రేపటికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన క్రాస్ పిటిషన్ ఇంకా హైకోర్టులో పెండింగ్ లో ఉంది.