అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సస్పెన్షన్

దిశ, బోధన్: కలెక్టర్ నారాయణ రెడ్డి గురువారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బోధన్ మండలం పాండుఫారం గ్రామంలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర బాలికల మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ పరిశీలించారు. చేపట్టిన పనులకు, మెజర్మెంట్ బుక్‌లో రికార్డ్ చేసిన దానికి భారీ వ్యత్యాసాన్ని గుర్తించి, వెంటనే అట్టి రికార్డులను నమోదు చేసిన నిజామాబాద్ డివిజన్‌కు చెందిన అసిస్టెంట్ ఇంజినీర్ ఎన్.నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తూ, ఆదేశాలు జారీ చేశారు. కొన్ని పనులు పూర్తి కాకుండానే నిధులను […]

Update: 2020-08-27 08:44 GMT

దిశ, బోధన్: కలెక్టర్ నారాయణ రెడ్డి గురువారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బోధన్ మండలం పాండుఫారం గ్రామంలో నిర్మాణంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర బాలికల మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ పరిశీలించారు. చేపట్టిన పనులకు, మెజర్మెంట్ బుక్‌లో రికార్డ్ చేసిన దానికి భారీ వ్యత్యాసాన్ని గుర్తించి, వెంటనే అట్టి రికార్డులను నమోదు చేసిన నిజామాబాద్ డివిజన్‌కు చెందిన అసిస్టెంట్ ఇంజినీర్ ఎన్.నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తూ, ఆదేశాలు జారీ చేశారు.

కొన్ని పనులు పూర్తి కాకుండానే నిధులను విడుదల చేయాల్సిందిగా ప్రతిపాదనలు సమర్పించారని, పూర్తి చేసిన పనులకు సంబంధించిన కొలతల్లో భారీగా వ్యత్యాసం చూపుతూ నమోదు చేసారని తెలిపారు. ఇది బాధ్యతా రాహిత్యం అని, అధికారులను తప్పుదోవ పట్టించడం ప్రస్ఫుట పరుస్తోందని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… అధికారులు తమకు కేటాయించిన విధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఆదేశాలకు అనుగుణంగా పని చేయాలని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags:    

Similar News