Konda Surekha: సీఎం రేవంత్ కృషి ఫలించినందుకు ఆనందంగా ఉంది
తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆమోదిస్తున్నట్లు ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబుకు(Chandrababu) మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ధన్యవాదాలు చెప్పారు.
దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆమోదిస్తున్నట్లు ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబుకు(Chandrababu) మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. తిరుమలలో తెలంగాణ భక్తులకు ప్రత్యేక దర్శనం కోసం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలో కొనసాగిన తమ కృషి ఫలించిందని పేర్కొన్నారు. తిరుమల దర్శన సౌకర్యాన్ని తెలంగాణ భక్తులకు నూతన సంవత్సర కానుకగా అభివర్ణించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఎల్లవేళలా ఇదే విధంగా సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు. చంద్రబాబుతో పాటు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు.