Revanth: ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు

తిరుమల ఆలయంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని ఏపీ ప్రభుత్వం(AP Government) నిర్ణయం తీసుకుంది.

Update: 2024-12-30 15:59 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుమల ఆలయంలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని ఏపీ ప్రభుత్వం(AP Government) నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu)కు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో రేవంత్ రెడ్డి.. కలియుగ దైవం వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)లో తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞాపన లేఖలను అనుమతించడానికి ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే సిఫారసు లేఖలపై చంద్రబాబుకు రేవంత్ రెడ్డి రాసిన లేఖను, దానికి రిప్లై ఇస్తూ చంద్రబాబు రాసిన లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. చంద్రబాబు రాసిన లేఖ(Letter)లో తిరుమల(Thirumala) శ్రీవారి ఆలయంలో దర్శనాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల (MP/MLC/MLA) సిఫారసు లేఖలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు.

అలాగే తెలంగాణ ప్రజలకు(Telangana People) తిరుమల వెంకటేశ్వర స్వామి వారితో వందల సంవత్సరాలుగా విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉందని, తెలంగాణ నుంచి ప్రతి రోజూ వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని, ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉందని గుర్తుచేశారు. శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని, తెలుగు జాతి సత్సంబంధాల నేపథ్యంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై అనుమతులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఇక ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతివారం ఏదైనా రెండు రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) వీఐపీ బ్రేక్ దర్శనం (రూ.500/- టికెట్) కొరకు రెండు లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శన్ (SED) (రూ. 300/- టికెట్) కొరకు రెండు లేఖలు స్వీకరించబడతాయని తెలిపారు. అంతేగాక ప్రతి లేఖతో ఆరుగురు భక్తుల వరకు దర్శనానికి సిఫారసు చేయొచ్చని సీఎం చంద్రబాబు లేఖ ద్వారా వెల్లడించారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి గత సంప్రదాయం ప్రకారం తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులు ఇచ్చే విజ్ఞాపనల మేరకు స్వామి వారి దర్శనానికి, ఆర్జిత సేవలకు అవకాశం కల్పించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కోరారు.

 

 

Tags:    

Similar News