హ‌రిత‌హారం ల‌క్ష్యాలు చేరుకోవాలి

దిశ‌, కొత్త‌గూడెం : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటిన అధికారులను కలెక్టర్ ఎంవీ రెడ్డి అభినందించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మ‌కంగా చేపట్టిన ఈ హరితహారంలో ప్రతిఒక్కరూ ఎంతో బాధ్యతగా తీసుకుంటూ భాగస్వాములు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. వర్షాకాలం మొక్కలకు చాలా ఇష్టమైన కాలం అని, వర్షాలు కూడా మంచిగా కురుస్తున్నందున అత్యంత ప్రధాన్యతతో జాప్యం చేయకుండా మొక్కలు నాటాలని చెప్పారు. కేటాయించిన లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయని అధికారులపై […]

Update: 2020-07-26 08:42 GMT

దిశ‌, కొత్త‌గూడెం : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటిన అధికారులను కలెక్టర్ ఎంవీ రెడ్డి అభినందించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మ‌కంగా చేపట్టిన ఈ హరితహారంలో ప్రతిఒక్కరూ ఎంతో బాధ్యతగా తీసుకుంటూ భాగస్వాములు అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. వర్షాకాలం మొక్కలకు చాలా ఇష్టమైన కాలం అని, వర్షాలు కూడా మంచిగా కురుస్తున్నందున అత్యంత ప్రధాన్యతతో జాప్యం చేయకుండా మొక్కలు నాటాలని చెప్పారు. కేటాయించిన లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎందుకు లక్షాన్ని సాధించలేక పోయారు? జాప్యానికి కారణాలు, మిగిలిన మొక్కలు ఎప్పటిలోగా నాటుతారో సమగ్రమైన నివేదికలు అందచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News