ఆ రాష్ట్రాలకు కేంద్రం అదనపు సాయం

న్యూఢిల్లీ: ప్రస్తుత సంవత్సరంలో విపత్తులను ఎదుర్కొన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం విడుదల చేసింది. శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది. ఆరు రాష్ట్రాలకు రూ.4,832కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాదిలో తుపాన్, వరదలు, కొండ చరియలు విరిగిపడటం వల్ల పశ్చిమబెంగాల్, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, సిక్కిం రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ రాష్ట్రాలకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (NDRF) కింద […]

Update: 2020-11-13 07:27 GMT

న్యూఢిల్లీ: ప్రస్తుత సంవత్సరంలో విపత్తులను ఎదుర్కొన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక సహాయం విడుదల చేసింది. శుక్రవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైంది. ఆరు రాష్ట్రాలకు రూ.4,832కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాదిలో తుపాన్, వరదలు, కొండ చరియలు విరిగిపడటం వల్ల పశ్చిమబెంగాల్, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, సిక్కిం రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి.

ఈ రాష్ట్రాలకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (NDRF) కింద అదనపు కేంద్ర సహాయం మంజూరు చేస్తున్నట్లు హోం మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అంఫాన్ తుపాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన పశ్చిమబెంగాల్‌కు రూ.2,707.77కోట్లు, ఒడిశాకు రూ.128.23కోట్లు, నిసర్గ తుపాను ప్రభావితానికి గురైన మహారాష్ట్రకు రూ.128.23కోట్లు, నైరుతి రుతుపవనాల కారణంగా వరదలు, కొండ చరియలు విరిగిపడి నష్టపోయిన కర్ణాటకకు రూ.577.48కోట్లు, మధ్యప్రదేశ్‌కు 611.61కోట్లు, సిక్కింకు రూ.87.84కోట్లు విడుదల చేసింది.

Tags:    

Similar News