ఆక్సిజన్ కొరత: కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోగులు ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ దానిని అధిగమించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒక లక్ష పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సేకరించాలని, 500 కొత్త ప్రెషర్ స్వింగ్ అడ్‌సార్ప్షన్ (పీఎస్ఎ) ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయించింది. ఇందుకు గాను పీఎం కేర్స్ ఫండ్ నిధులను ఉపయోగించనుంది. దేశంలో ఆక్సిజన్ కొరత నుంచి వీలైనంత త్వరగా దేశాన్ని గట్టెక్కించడానికి గాను లక్ష పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కొనుగోలు చేయాలని అధికారులను […]

Update: 2021-04-28 10:20 GMT

న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోగులు ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ దానిని అధిగమించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒక లక్ష పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సేకరించాలని, 500 కొత్త ప్రెషర్ స్వింగ్ అడ్‌సార్ప్షన్ (పీఎస్ఎ) ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాలని నిర్ణయించింది. ఇందుకు గాను పీఎం కేర్స్ ఫండ్ నిధులను ఉపయోగించనుంది. దేశంలో ఆక్సిజన్ కొరత నుంచి వీలైనంత త్వరగా దేశాన్ని గట్టెక్కించడానికి గాను లక్ష పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను కొనుగోలు చేయాలని అధికారులను ప్రధాని ఆదేశించారు.

అదే సమయంలో ఇప్పటికే అనుమతించిన 713 ఆక్సిజన్ ప్లాంట్లకు మరో 500 (మొత్తం 1,213)ను అదనంగా మంజూరు చేసినట్టు పీఎంవో ఇక ప్రకటనలో తెలిపింది. వీటిని జిల్లా కేంద్రాలలో ఉన్న ఆస్పత్రులతో పాటు టైర్-2 సిటీస్ లోనూ తక్షణమే నెలకొల్పాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే విషయమై ప్రధాని మోడీ ట్వీట్ కూడా చేశారు.

Tags:    

Similar News