నిధులు ఇవ్వం.. ఏపీ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చిన కేంద్రం
దిశ, ఏపీ బ్యూరో : ఏపీ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో 2014 అంచనాలకే నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. అదనపు పనులకు నిధులు ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. సోమవారం రాజ్యసభలో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి పోలవరం ప్రాజెక్టుపై కేంద్రాన్ని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిందని దానికి అనుగుణంగా నిధులు మంజూరు చేయాలని కోరారు. దీంతో విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ […]
దిశ, ఏపీ బ్యూరో : ఏపీ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో 2014 అంచనాలకే నిధులు ఇస్తామని స్పష్టం చేసింది. అదనపు పనులకు నిధులు ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. సోమవారం రాజ్యసభలో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి పోలవరం ప్రాజెక్టుపై కేంద్రాన్ని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిందని దానికి అనుగుణంగా నిధులు మంజూరు చేయాలని కోరారు.
దీంతో విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ జవాబిచ్చారు. 2014 ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల అంచనాలు ఏ మేరకు ఉన్నాయో.. అంత మొత్తాన్ని మాత్రమే తాము భరిస్తామని క్లారిటీ ఇచ్చారు. పోలవరం హెడ్ వర్క్స్ డిజైన్ల మార్పు కారణంగా వ్యయం రూ.5,535 కోట్ల నుంచి రూ.7,192 కోట్లకు పెరిగినట్టు ఏపీ ప్రభుత్వం చెప్తోందని వివరించారు.
అలాగే కాఫర్ డ్యాం, స్పిల్ వే కాంక్రీట్ పనులు, డయాఫ్రం వాల్ పనులు, చిప్పింగ్ తదితర పనులు అదనంగా చేపట్టినట్టు జగన్ సర్కార్ తెలిపిందని వెల్లడించారు. అయితే గోదావరి ట్రైబ్యునల్‌కు లోబడి ప్రాజెక్టు డిజైన్లు ఉండాలని సూచించారు. సీడబ్ల్యూసీ కొన్ని మార్పులకు ఆమోదం తెలిపిన పిమ్మట పోలవరం వద్ద అదనపు పనులు చేపట్టారని.. అయితే వీటికి కేంద్రం నుంచి అదనపు నిధులు కేటాయించే ప్రసక్తే లేదని జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తేల్చి చెప్పారు.