కరెన్సీ నోట్లు, న్యూస్ పేపర్ల ద్వారా కరోనా రాదు : సీడీసీ

వాషింగ్టన్: చైనాలో పుట్టిన కరోనా కేవలం మనిషి నుంచి మనిషికి మాత్రమే సంక్రమిస్తుందని.. మరేరకంగానూ సోకే అవకాశం లేదని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) చేసిన ఓ అధ్యయనంలో వెల్లడించింది. కరోనా వైరస్ పుట్టిన దగ్గర నుంచి ప్రజల్లో అనేక రకాలైన అపోహలు, అనుమానాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్-19 వ్యాధిగ్రస్తులు పట్టుకున్న న్యూస్ పేపర్లు, కరెన్సీ నోట్లు, వారు వాడిన వస్తువులు తాకడం వల్ల ఇతరులకు వ్యాధి సోకుతుందని.. వాళ్లు […]

Update: 2020-05-22 01:19 GMT

వాషింగ్టన్: చైనాలో పుట్టిన కరోనా కేవలం మనిషి నుంచి మనిషికి మాత్రమే సంక్రమిస్తుందని.. మరేరకంగానూ సోకే అవకాశం లేదని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) చేసిన ఓ అధ్యయనంలో వెల్లడించింది. కరోనా వైరస్ పుట్టిన దగ్గర నుంచి ప్రజల్లో అనేక రకాలైన అపోహలు, అనుమానాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్-19 వ్యాధిగ్రస్తులు పట్టుకున్న న్యూస్ పేపర్లు, కరెన్సీ నోట్లు, వారు వాడిన వస్తువులు తాకడం వల్ల ఇతరులకు వ్యాధి సోకుతుందని.. వాళ్లు తిరిగిన ప్రదేశాల్లో తిరిగినా వ్యాధి సంక్రమిస్తుందని భావించారు. కాగా సీడీసీ అధ్యయనంలో ఇదంతా అవాస్తవమని తేలింది. ఇప్పటివరకూ ఈ విధంగా ఎవరికీ వ్యాధి సంక్రమించలేదని.. అలాంటి ఆధారాలు ఎక్కడా దొరకలేదని చెప్పింది. కరోనా ఉన్న రోగిని తాకితే మాత్రం వ్యాధి వస్తుందని.. వారి పక్కన కొద్దిసేపు నిలబడి మాట్లాడినా వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. అయితే కరోనా వ్యాధిగ్రస్తుడు వాడిన వస్తువుల ఉపరితలాన్ని సాధారణ వ్యక్తి పట్టుకొని.. ఆ చేతులతో ముక్కు, కళ్లు, నోరు తాకితే మాత్రం వ్యాధి సంక్రమిస్తున్నట్టు తెలిపింది. చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా కడుక్కోవడం ద్వారా, శానిటైజర్లను వాడటం ద్వారా కోవిడ్-19 నుంచి కాపాడుకోవచ్చని సీడీసీ వివరించింది. సీడీసీ అధ్యయనం నిజమేనని నిపుణులు కూడా చెబుతున్నారు. ఎందుకంటే.. ఒకవేళ కరోనా వైరస్ న్యూస్ పేపర్లు, కరెన్సీ నోట్ల ద్వారా వస్తే.. ఇప్పటికల్లా ప్రపంచంలోని జనాభా అంతా ఈ వ్యాధి బారిన పడేవారేకదా అని అంటున్నారు.

Tags:    

Similar News