గేదె పై ప్రచారం.. అభ్యర్థి పై కేసు

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న ప్రచారాలు చేస్తూనే ఉంటారు. కానీ, ఓ అభ్యర్థి వినూత్నంగా ప్రయత్నించి పోలీసుల చేత కేసు నమోదు చేయించుకున్నాడు. ఇంతకీ ఆయన ఏం చేశాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఏకంగా ఓ గేదే పైన సవారీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. దీంతో జంతువులను హింసించడం.. కరోనా నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాళ్లోకి వెళితే.. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న […]

Update: 2020-10-19 05:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న ప్రచారాలు చేస్తూనే ఉంటారు. కానీ, ఓ అభ్యర్థి వినూత్నంగా ప్రయత్నించి పోలీసుల చేత కేసు నమోదు చేయించుకున్నాడు. ఇంతకీ ఆయన ఏం చేశాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఏకంగా ఓ గేదే పైన సవారీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. దీంతో జంతువులను హింసించడం.. కరోనా నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాళ్లోకి వెళితే.. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయా పార్టీల నేతలు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రీయ ఉలేమా కౌన్సిల్ పార్టీ అభ్యర్థి మహ్మద్ పర్వేజ్ మున్సూరి గయా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. ఓ గేదే ను ఎక్కి ర్యాలీ నిర్వహించాడు. దీంతో ర్యాలీ మధ్యలోనే ఎంటర్ అయిన పోలీసులు చట్టాలను ఉల్లంఘించారని కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News