అతడి ఏడుపు వెనక దాగిన నిజం.. పాపం ప్రియురాలు
దిశ, వెబ్ డెస్క్: ప్రేమ వలలో పడి ఎంతోమంది యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కానీ కొంతమంది ప్రేమ పేరుతో మోసం చేసి, తమ వ్యక్తిగత అవసరాలను తీర్చుకుంటున్నారు. వారి ప్రేమతో ఆటలాడి వారి నిండు ప్రాణాలను బలితీసుకొంటున్నారు. తాజాగా ఒక యువతిని ప్రేమలో దింపి, ఆమె మృతిచెందడానికి కారణమయ్యాడు ఒక కిరాతకుడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. చామరాజ నగర్ జిల్లా అంజయేనపుర గ్రామంలో ఉపేంద్ర అనే యువకుడు, నంజమ్మణ్ణి అనే యువతి ఇద్దరు ప్రేమించుకున్నారు. […]
దిశ, వెబ్ డెస్క్: ప్రేమ వలలో పడి ఎంతోమంది యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కానీ కొంతమంది ప్రేమ పేరుతో మోసం చేసి, తమ వ్యక్తిగత అవసరాలను తీర్చుకుంటున్నారు. వారి ప్రేమతో ఆటలాడి వారి నిండు ప్రాణాలను బలితీసుకొంటున్నారు. తాజాగా ఒక యువతిని ప్రేమలో దింపి, ఆమె మృతిచెందడానికి కారణమయ్యాడు ఒక కిరాతకుడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.
చామరాజ నగర్ జిల్లా అంజయేనపుర గ్రామంలో ఉపేంద్ర అనే యువకుడు, నంజమ్మణ్ణి అనే యువతి ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరు ఇంట్లో పెద్దవాళ్ళను ఒప్పించి నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. మరి కొద్దీ రోజుల్లో పెళ్లి అనేలోపు యువతి తల్లిదండ్రులకు ఉపేంద్ర మరో యువతిని కూడా ప్రేమిస్తున్నాడని తెలిసింది. దీంతో వారు యువకుడ్ని నిలదీశారు. అతను తాను ఇద్దర్ని ప్రేమించానని, ఇద్దర్ని పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. అదెలా సాధ్యం? మా అమ్మాయి జీవితంతో ఆటలు ఆడకు? అంటూ వారు యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయమై ఉపేంద్ర, నంజమ్మణ్ణి కి ఫోన్ చేసి మీ కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని, మనం పెళ్లి చేసుకోలేమని ఆత్మహత్య చేసుకుందామని నాటకమాడాడు. ఇది నిజమే అని నమ్మిన యువతి అతని కళ్లముందే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి మృతిచెందిన అనంతరం ఏమి తెలియని వాడిలా ఏడవటం మొదలు పెట్టాడు. దీంతో అనుమానమొచ్చిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఉపేంద్రను అరెస్ట్ చేశారు.