మీడియా ఓవరాక్షన్ తగ్గించుకోవాలి: హైకోర్టు

దిశ,వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కుగా ఉంది .అయితే సోషల్ మీడియాలో నిజానిజాలు తెలియక ముందే పోస్ట్ చేయడం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో అసలు నేరం చేసిన వారు ఎవరు నేరం చేయని వారు ఎవరు అనేది తెలియడం కష్టం అవుతుంది. ఈ నేపథ్యంలో పూణేలోని బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యాలు చేసింది.. తన కూతురుపై అక్రమ సంబంధాలు ఉన్నాయని వస్తున్న కథనాలపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ, ఆమె తండ్రి దాఖలు చేసిన పిటిషన్ ను […]

Update: 2021-03-06 02:53 GMT

దిశ,వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఎక్కుగా ఉంది .అయితే సోషల్ మీడియాలో నిజానిజాలు తెలియక ముందే పోస్ట్ చేయడం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో అసలు నేరం చేసిన వారు ఎవరు నేరం చేయని వారు ఎవరు అనేది తెలియడం కష్టం అవుతుంది. ఈ నేపథ్యంలో పూణేలోని బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యాలు చేసింది.. తన కూతురుపై అక్రమ సంబంధాలు ఉన్నాయని వస్తున్న కథనాలపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ, ఆమె తండ్రి దాఖలు చేసిన పిటిషన్ ను జిస్టిస్ ఎస్ఎస్ షిండే, మనీశ్ పితాలేలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది.

సున్నితమైన కేసులలో మీడియా నియంత్రణ పాటించాలని సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో హైకోర్టు సూచించిందని ..ఈ కేసు విషయంలో కూడా అదే విధమైన సూచనలు చేయాలని సీనియర్ లాయర్ గుప్టే హైకోర్టును కోరారు. దీనిపై స్సందించిన హైకోర్టు పుణెలో 23 ఏళ్ల మహిళ ఆత్మహత్య కేసులో మీడియా పబ్లిసిటీ చేయవద్దని, ఓవరాక్షన్ తగ్గించుకోవాలని మీడియాకు హితవు పలికింది.

పిటిషన్ లో ఏం ఉంది…

పిటిషనర్ కూతురు బాల్కని నుంచి పడిపోయిందని ..ఫిబ్రవరి 8న ఆమె చనిపోయిందని ఆసుపత్రిలోని వైద్యులు తెలిపారని పిటిషనర్ తరుపున సీనియర్ లాయర్ శిరీష్ గుప్టే కోర్టుకి తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే మీడియ సంస్థలు ఆమె ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని కథనాలు రాయడం, అలానే గుర్తు తెలియని వ్యక్తులతో మాట్లడిన ఆడియో క్లిప్ లను రాజకీయపార్టీలు, మీడియా సంస్థలు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేసినట్టు పిటిషన్ లో పేర్కొన్నారు.

 

Tags:    

Similar News