బీరా పేరు వాగులో తండ్రీ, కొడుకుల మృత దేహాలు లభ్యం
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లా సంగం మండలం బీరాపేరు వాగులో ఐదుగురు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బృందాలు రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అయితే శనివారం ఉదయం కర్రా పుల్లయ్య (60) మృతదేహం లభ్యమైంది. మధ్యాహ్నానికి కర్రా నాగరాజు (40) మృతదేహం కూడా లభ్యమైంది. వీరిద్దరు తండ్రి కొడుకులు. మరో ముగ్గురు ఆచూకీ తెలియాల్సి ఉంది. ఆ ముగ్గురి జాడ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు […]
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లా సంగం మండలం బీరాపేరు వాగులో ఐదుగురు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బృందాలు రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అయితే శనివారం ఉదయం కర్రా పుల్లయ్య (60) మృతదేహం లభ్యమైంది. మధ్యాహ్నానికి కర్రా నాగరాజు (40) మృతదేహం కూడా లభ్యమైంది.
వీరిద్దరు తండ్రి కొడుకులు. మరో ముగ్గురు ఆచూకీ తెలియాల్సి ఉంది. ఆ ముగ్గురి జాడ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఆర్డీవో చైత్ర వర్షిణి, పోలీసు అధికారులు సంఘటనా స్థలంలోనే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ఆర్డీవో ఉదారత
సంగం మండలం బీరాపేరు వాగులో గల్లంతైన వారి కుటుంబాల పట్ల ఆర్డీవో చైత్ర వర్షిణి తన ఉదారత చాటుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలబడ్డారు. రెండు రోజులుగా తిండి లేకుండా బోరున విలపిస్తున్న గల్లంతైన వారి కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబ సభ్యులకు నిత్యావసర వస్తువుల కోసం తన సొంత నగదును రూ. 20వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆర్డీవోకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.