వారసత్వ రాజకీయాలకతీతమైన పార్టీ బీజేపీ : మురళీధర్ రావు
దిశ, సంగారెడ్డి : వారసత్వ రాజకీయాలకు అతీతంగా బీజేపీ పని చేస్తుందని ఆ పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా కందిలో జరుగుతున్న బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులకు మంగళవారం ఆయన హాజరై మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తే సామాన్యులు సైతం ప్రధాని, రాష్ట్రపతి అయ్యే అవకాశం బీజేపీలో ఉందన్నారు. కన్యకుమారి నుంచి కశ్మీర్ వరకు విస్తరించిన ప్రజాక్షేత్రంలో అత్యధిక సభ్యత్వం కలిగిన జాతీయ పార్టీ […]
దిశ, సంగారెడ్డి : వారసత్వ రాజకీయాలకు అతీతంగా బీజేపీ పని చేస్తుందని ఆ పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా కందిలో జరుగుతున్న బీజేపీ కార్యకర్తల శిక్షణ తరగతులకు మంగళవారం ఆయన హాజరై మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తే సామాన్యులు సైతం ప్రధాని, రాష్ట్రపతి అయ్యే అవకాశం బీజేపీలో ఉందన్నారు. కన్యకుమారి నుంచి కశ్మీర్ వరకు విస్తరించిన ప్రజాక్షేత్రంలో అత్యధిక సభ్యత్వం కలిగిన జాతీయ పార్టీ బీజేపీ అన్నారు. తీవ్రవాదులతో, నక్సలైట్లతో పోరాటం చేసి అసువులు బాసిన చరిత్ర కార్యకర్తలకు ఉందని గుర్తు చేస్తూ, తెలంగాణాలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే రానున్న కాలంలో రాష్ట్రంలో రాజ్యాధికారం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు.
భారతీయ జనతాపార్టీ కులాలు, మతాలు, ఓట్లకు, నోట్లకు సంబంధం లేకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం చేస్తుందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అమరవీరులను గౌరవించడం బీజేపీ లక్ష్యమన్నారు. 135 కోట్ల జనాభాలో 130 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చి ప్రపంచంలోనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతిలో కూరుకుపోయారని, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే పార్టీ బీజేపీ అన్నారు. వడ్లు కొనాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై నిందలు మోపడం సరికాదన్నారు. గతంలో చేసుకున్న ఒప్పందాల మేరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేసి ఇవ్వలేదన్నారు.
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని కార్యకర్తలందరూ గట్టి నిర్ణయం తీసుకొని కష్టపడి పనిచేయాలని సూచించారు. బీజేపీ కార్యకర్తలను చూసి టీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారని తెలిపారు. ఈ శిక్షణా తరగతులల్లో జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి రాజేశ్వర్ రావు దేశ్ పాండే, నాయకులు చంద్రశేఖర్, జగన్, విష్ణువర్ధన్ రెడ్డి, కసిని వాసు, రాములు, నాగరాజు, జయరాం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.