కోడిగుడ్ల కోసం వచ్చిన పాము.. చిన్నారిని మింగేసింది

దిశ,వెబ్ డెస్క్ : అంగన్ వాడీ కేంద్రంలో పాముకాటుతో చిన్నారి మృతి చెందిన ఘటన కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలం రామవరపుమోడిలో  చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. రామవరపుమోడిలోని నాగ అనూష, నాగ మల్లేశ్వరరావు దంపతులకు ఇద్దరు కూతుర్లు. వర్షిణి(4)పెద్దకూతురు కాగా, స్నేహ సాత్విక చిన్న కూతురు(3). వీరిద్దరు దగ్గరిలోని అంగన్ వాడీ కేంద్రానికి రోజు వెళ్తారు. మంగళవారం యథావిధిగా ఇద్దరూ అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఆడుకుంటుండగా.. అంగన్ వాడీ కేంద్రంలోని కోడిగుడ్ల కోసం వచ్చిన […]

Update: 2021-03-16 22:43 GMT

దిశ,వెబ్ డెస్క్ : అంగన్ వాడీ కేంద్రంలో పాముకాటుతో చిన్నారి మృతి చెందిన ఘటన కృష్ణాజిల్లా బంటుమిల్లి మండలం రామవరపుమోడిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. రామవరపుమోడిలోని నాగ అనూష, నాగ మల్లేశ్వరరావు దంపతులకు ఇద్దరు కూతుర్లు. వర్షిణి(4)పెద్దకూతురు కాగా, స్నేహ సాత్విక చిన్న కూతురు(3). వీరిద్దరు దగ్గరిలోని అంగన్ వాడీ కేంద్రానికి రోజు వెళ్తారు. మంగళవారం యథావిధిగా ఇద్దరూ అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఆడుకుంటుండగా.. అంగన్ వాడీ కేంద్రంలోని కోడిగుడ్ల కోసం వచ్చిన తాచుపాము ట్రే పక్కన పడుకుని ఉన్నది. అది గమనించని సాత్విక అటుగా వెళ్లడంతో తాచు పాము కాటేసింది. గమనించిన అంగన్ వాడీ కార్యకర్తలు చిన్నారి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వారు మొదట నాటు వైద్యంచేయించారు. అనంతరం పాప ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా మారడంతో మచిలీపట్నం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో చిన్నారి ప్రాణాలు విడిచింది. దీంతో ఆ కుటుబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News