ఆదివాసీ మహిళననే.. ఈ రకంగా అవమానం

దిశ, ఆదిలాబాద్: నేను ఒక జెడ్పీ చైర్ పర్సన్ అయినా, ఆదివాసీ మహిళను కావడం మూలంగానే జిల్లా కలెక్టర్ తనను అవమానిస్తున్నారని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ కోవ లక్ష్మి ఆరోపించారు. బుధవారం జరిగిన ఆసిఫాబాద్ జెడ్పీ సమావేశంలో ఆమె ఈ ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆసిఫాబాద్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజాప్రతినిధులను తీవ్రంగా అవమానిస్తున్నారని, తననైతే అసలు పట్టించుకోకుండా తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో […]

Update: 2020-07-15 09:13 GMT

దిశ, ఆదిలాబాద్: నేను ఒక జెడ్పీ చైర్ పర్సన్ అయినా, ఆదివాసీ మహిళను కావడం మూలంగానే జిల్లా కలెక్టర్ తనను అవమానిస్తున్నారని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ కోవ లక్ష్మి ఆరోపించారు. బుధవారం జరిగిన ఆసిఫాబాద్ జెడ్పీ సమావేశంలో ఆమె ఈ ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆసిఫాబాద్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజాప్రతినిధులను తీవ్రంగా అవమానిస్తున్నారని, తననైతే అసలు పట్టించుకోకుండా తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల విషయంలో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో పాలన కుంటు పడడానికి కలెక్టర్ తీరే కారణమని విమర్శించారు. ఆయన తీరుపై జిల్లా శాసనసభ్యులతో కలిసి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు.

Tags:    

Similar News