ఒక దేశం.. ఒకే మార్కెట్‌తో గుత్తేదారులకు మేలు

దిశ, న్యూస్‌ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ‘ఒక దేశం.. ఒకే మార్కెట్’ అనే నినాదం వెనుక గుత్తపెట్టుబడిదారులకు ప్రయోజనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం జూన్ 3వ తేదీన కేబినెట్‌లో నిత్యావసర వస్తువుల సరకులకు సంబంధించిన చట్టాన్ని సవరిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం చాడ వెంకటరెడ్డి ఓ ప్రకటన చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పెద్ద కార్పొరేషన్లు, వ్యాపారస్థులు, సూపర్‌మార్కెట్ అపరిమితంగా […]

Update: 2020-06-05 11:08 GMT

దిశ, న్యూస్‌ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ‘ఒక దేశం.. ఒకే మార్కెట్’ అనే నినాదం వెనుక గుత్తపెట్టుబడిదారులకు ప్రయోజనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం జూన్ 3వ తేదీన కేబినెట్‌లో నిత్యావసర వస్తువుల సరకులకు సంబంధించిన చట్టాన్ని సవరిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం చాడ వెంకటరెడ్డి ఓ ప్రకటన చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పెద్ద కార్పొరేషన్లు, వ్యాపారస్థులు, సూపర్‌మార్కెట్ అపరిమితంగా సరుకులను నిలువ చేసుకునేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. వ్యవసాయానికి సంబంధించి రైతులకు విత్తనాలు, ఎరువులకు సంబంధించి ఏ రకమైన ప్రయోజనం కలిగించలేదని తెలిపారు. ఇది కేవలం బడా వ్యాపారస్థులకు మాత్రమే లాభాలు తెచ్చి పెడుతుందని విమర్శించారు. ‘రెండో ప్రపంచ యుద్ధం అనంతరం దేశంలో ఆహార ధాన్యాల కృత్రిమ కొరతను అధిగమించేందుకు బ్రిటిష్ ఇండియా తెచ్చిన చట్టం తెచ్చిందని, ఈ చట్టాన్ని 1957లో మళ్లీ భారత ప్రభుత్వ చట్టంగా రూపొందించారని, దీనిని ఆర్డినెన్స్ ద్వారా నీరుగార్చడం దుర్మార్గం’ అని చాడ పేర్కొన్నారు. (కొవిడ్ -19) కరోనా వైరస్‌ను అడ్డంపెట్టుకోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలు తీసుకరావడం పట్ల ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని సీపీఐ డిమాండ్ చేస్తుందని, దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పార్టీ కార్యకర్తలకు చాడ వెంకటరెడ్డి పిలుపు నిచ్చారు.

Tags:    

Similar News