Breaking: బంజారాహిల్స్లో కారు బీభత్సం.. డ్రైవర్ పరారీ
హైదరాబాద్ బంజారాహిల్స్లో రోడ్డు ప్రమాదం జరిగింది..
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ బంజారాహిల్స్(Hyderabad Banjara Hills)లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం 6 గంటల సమయంలో కారు(Car) బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్లి డివైడర్ను, స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో కారు ముందు భాగం ధ్వంసం అయింది. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్ పరారీ అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులను పికప్- డ్రాపింగ్ చేసే కారుగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. స్థానిక సీసీ టీవీ పుటేజులను పరిశీలిస్తున్నారు. కారు నెంబర్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.