Minister Payyavula: తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీ.. అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కీలక ప్రకటన

ఏడో రోజు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) వాడీవేడిగా కొనసాగుతున్నాయి.

Update: 2024-11-19 05:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏడో రోజు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాలు (Assembly Sessions) వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Speaker Ayyanna Pathrudu) ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీల (Transfers of Employees)పై చర్చ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) కీలక ప్రకటన చేశారు. ఉద్యోగుల బదీలీలపై తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అన్నారు. అధికారుల తాజా నివేదిక ప్రకారం.. మొత్తం 1,942 మంది ఏపీ ఉద్యోగులు (AP Employees) తెలంగాణ (Telangana)కు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. 1,447 మంది తెలంగాణ (Telangana)కు చెందిన ఉద్యోగులు ఏపీ (AP)కి రావాలనుకుంటున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల వన్‌టైమ్ రిలీవ్ (One Time Relieve) కోసం తెలంగాణ ప్రభుత్వాని (Telangana Government)కి ప్రతిపాదనలు పంపామని వివరించారు. అందుకు అక్కడి ప్రభుత్వం నుంచి సమాధానం రావాల్సి ఉందని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు.  

Tags:    

Similar News