యూనిక్ కాన్సెప్ట్‌తో ‘థ్యాంక్ యు బ్రదర్’

దిశ, వెబ్‌డెస్క్: అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. రమేష్ రాపర్తి డైరెక్షన్‌లో వస్తోన్న చిత్రం ట్రైలర్ విక్టరీ వెంకటేశ్ విడుదల చేశారు. ఆవారాగా తిరిగే అబ్బాయిగా అశ్విన్ విరాజ్ కనిపిస్తుండగా.. తల్లి కూడా తన ప్రవర్తనతో విసిగివేసారిపోతోంది. కొడుకుగా చెప్పుకునేందుకే సిగ్గుపడుతుంది. గతంలో జరిగిన సంఘటనలతో తను ఏది చెప్పినా అబద్ధమనుకుని నమ్మలేని ఫ్రెండ్స్..అలాంటి అబ్బాయి ఒక్క ఘటనతో అందరి మెప్పు పొందుతాడు. నెగెటివ్ షేడ్స్ నుంచి పాజిటివ్ […]

Update: 2021-01-28 06:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. రమేష్ రాపర్తి డైరెక్షన్‌లో వస్తోన్న చిత్రం ట్రైలర్ విక్టరీ వెంకటేశ్ విడుదల చేశారు. ఆవారాగా తిరిగే అబ్బాయిగా అశ్విన్ విరాజ్ కనిపిస్తుండగా.. తల్లి కూడా తన ప్రవర్తనతో విసిగివేసారిపోతోంది. కొడుకుగా చెప్పుకునేందుకే సిగ్గుపడుతుంది. గతంలో జరిగిన సంఘటనలతో తను ఏది చెప్పినా అబద్ధమనుకుని నమ్మలేని ఫ్రెండ్స్..అలాంటి అబ్బాయి ఒక్క ఘటనతో అందరి మెప్పు పొందుతాడు. నెగెటివ్ షేడ్స్ నుంచి పాజిటివ్ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌కు మారిపోయిన అతను.. లిఫ్ట్‌లో తనతో పాటు ఇరుక్కుపోయిన గర్భిణి(అనసూయ భరద్వాజ్)కి ఎలా సహాయం చేస్తాడు?. సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి కనెక్ట్ అయి.. తల్లి ఇచ్చిన సూచనలతో పురుడు పోస్తాడా? లేదా? అనేది కథ అని ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది.

Full View

ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా ద్వారా అనసూయకు మరో కంటెంట్‌ ఉన్న రోల్ దక్కగా.. విరాజ్‌కు పర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. వైవా హర్ష, అర్చనా అనంత్, అనీష్ కీలక పాత్రల్లో కనిపించబోతుండగా..జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మాగుంట శ‌ర‌త్‌చంద్రా రెడ్డి, తార‌క్‌నాథ్ బొమ్మిరెడ్డి సినిమాను నిర్మించారు. గుణ బాలసుబ్రమణియన్ సంగీతం అందించారు.

Tags:    

Similar News