భారత జట్టును అంత తేలికగా తీసుకోలేం : బర్న్స్

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమ్ ఇండియా వన్డే సిరీస్‌ను కోల్పోయినంత మాత్రాన.. ఆ జట్టును తేలికగా తీసుకోలేమని ఆసీస్ టెస్టు ప్లేయర్ జో బర్న్స్ అన్నాడు. డేవిడ్ వార్నర్ తొడ కండరాల గాయంతో జట్టుకు దూరమయ్యాడు. టెస్టు సిరీస్ ప్రారంభం నాటికి అతడు కోలుకోకుంటే బర్న్స్‌ను ఓపెనర్‌గా పంపే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో అతడు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆదివారం నుంచి ఇండియా ఏ, ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య మ్యాచ్ […]

Update: 2020-12-03 11:06 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమ్ ఇండియా వన్డే సిరీస్‌ను కోల్పోయినంత మాత్రాన.. ఆ జట్టును తేలికగా తీసుకోలేమని ఆసీస్ టెస్టు ప్లేయర్ జో బర్న్స్ అన్నాడు. డేవిడ్ వార్నర్ తొడ కండరాల గాయంతో జట్టుకు దూరమయ్యాడు. టెస్టు సిరీస్ ప్రారంభం నాటికి అతడు కోలుకోకుంటే బర్న్స్‌ను ఓపెనర్‌గా పంపే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో అతడు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆదివారం నుంచి ఇండియా ఏ, ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో పకోస్కీతో కలసి బర్న్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.

వీరిద్దరూ ఈ మ్యాచ్‌లో రాణించడం ఆస్ట్రేలియా జట్టుకు తప్పనిసరి. ఈ ఏడాది క్వీన్స్‌లాండ్ తరపున ఆడిన బర్న్స్ విఫలమయ్యాడు. అయితే టీమ్ ఇండియాతో జరుగనున్న టెస్టు సిరీస్‌కు ఎంపిక కావడంతో అతడిపై ఒత్తిడి పెరిగింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో రాణించడం ద్వారా ఒత్తిడి తగ్గించుకోవాలని బర్న్స్ అనుకుంటున్నాడు. టీమ్ ఇండియాతో జరిగే టెస్టు అతడి కెరీర్‌కు కీలకం. అందుకే టీమ్ ఇండియాను తేలికగా తీసుకోవద్దని బర్న్స్ వ్యాఖ్యానించాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News