రఫెల్‌లు భారత్‌కు వచ్చే క్రమంలో.. ఓ ఉత్కంఠ పరిణామం
దిశ, వెబ్ డెస్క్: ఫ్రాన్స్ నుంచి తొలి విడత రాఫెల్ యుద్ధ విమానాలు భారతకు చేరాయి. రఫెల్ విమానాల రాకతో భారత త్రివిధ దళాలలో కొత్త ఉత్సాహం నెలకొంది. శత్రు దేశాల యుద్ద విమానాలను తుత్తునియలు చేసే శక్తి సామర్థ్యాలు ఉన్న రాఫెల్ విమానాలతో మన సైనిక వ్యవస్థ శక్తిసామర్థ్యాలు అమాంతం పెరిగాయని అంతర్జాతీయ రక్షణ నిపుణులు చెబుతున్నారు. కాగా రఫేల్ విమానాలు భారత్‌కు వచ్చే క్రమంలో ఓ ఉత్కంఠ పరిణామం చోటు చేసుకొంది. షెడ్యూల్ ప్రకారం […]
దిశ, వెబ్ డెస్క్: ఫ్రాన్స్ నుంచి తొలి విడత రాఫెల్ యుద్ధ విమానాలు భారతకు చేరాయి. రఫెల్ విమానాల రాకతో భారత త్రివిధ దళాలలో కొత్త ఉత్సాహం నెలకొంది. శత్రు దేశాల యుద్ద విమానాలను తుత్తునియలు చేసే శక్తి సామర్థ్యాలు ఉన్న రాఫెల్ విమానాలతో మన సైనిక వ్యవస్థ శక్తిసామర్థ్యాలు అమాంతం పెరిగాయని అంతర్జాతీయ రక్షణ నిపుణులు చెబుతున్నారు. కాగా రఫేల్ విమానాలు భారత్‌కు వచ్చే క్రమంలో ఓ ఉత్కంఠ పరిణామం చోటు చేసుకొంది. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన రఫేల్ విమానాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అల్ దాఫ్రా విమానాశ్రయానికి చేరాయి. మంగళవారం రాత్రి విమానాలు అక్కడ ఉన్న సమయంలో ఎయిర్ బేస్‌పై క్షిపణి దాడిని వెల్లడించే అత్యవసర సైరన్ మోగింది. అదే సమయంలో ఖతర్‌లోని అమెరికా వైమానిక స్థావరమైన అల్ ఉదైద్‌లో కూడా అలారం మోగింది. దీంతో అక్కడి బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులు అల్ దాఫ్రా ఎయిర్‌బేస్‌కు సమీపంలోని సముద్రజలాల్లో కూలిపోయాయి. దీంతో ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ నిర్వహిస్తున్న యుద్ధ విన్యాసాల్లో భాగంగా వీటిని ప్రయోగించినట్టు తేలింది. ఈ విషయాన్ని సీఎన్‌ఎన్, ఫాక్స్ న్యూస్‌కు చెందిన ప్రతినిధులు తమ అధికారిక ట్విటర్ ఖాతాల్లో వెల్లడించారు. డమ్మీ విమాన వాహక నౌకపై దాడులు
ఇరాన్ గత కొన్ని రోజులుగా హర్మూజ్ జలసంధిలో భారీగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విమాన వాహక నౌకలపై దాడి తదితర అంశాలను సాధన చేయడం కోసం హెలికాప్టర్లపై నుంచి ఈ నకిలీ విమాన వాహక నౌక పైకి క్షిపణులను ప్రయోగించారు.