పాయింట్లో మూత్రం పోస్తానన్న ప్రముఖ టెన్నిస్ స్టార్..

దిశ, వెబ్‌డెస్క్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో కనివిని ఎరుగని ఘటన చోటుచేసుకుంది. ప్రపంచంలోని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుల్లో ఒకరైన ‘డెనిస్ షాపోవాలోవ్’ టాయ్‌లెట్‌కు వెళ్లేందుకు అనుమతించడం లేదని సిట్టింగ్ అంపైర్‌తో వాదనకు దిగాడు. ‘పాయింట్లో మూత్రం పోస్తానని.. బాటిల్‌లో పోస్తానని’ అతనితో వాదించాడు. ఆటలో ఇలాంటి నిబంధనలు పెట్టడం ఎంటనీ డెనిస్ అసహనం వ్యక్తం చేశాడు. ఈయన ప్రపంచంలోని ప్రముఖ ఆటగాళ్ల జాబితాలో నెంబర్ 12 స్థానంలో కొనసాగుతున్నాడు. మంగళవారం ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నిలో పాల్గొన్న […]

Update: 2021-02-09 09:44 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో కనివిని ఎరుగని ఘటన చోటుచేసుకుంది. ప్రపంచంలోని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుల్లో ఒకరైన ‘డెనిస్ షాపోవాలోవ్’ టాయ్‌లెట్‌కు వెళ్లేందుకు అనుమతించడం లేదని సిట్టింగ్ అంపైర్‌తో వాదనకు దిగాడు. ‘పాయింట్లో మూత్రం పోస్తానని.. బాటిల్‌లో పోస్తానని’ అతనితో వాదించాడు. ఆటలో ఇలాంటి నిబంధనలు పెట్టడం ఎంటనీ డెనిస్ అసహనం వ్యక్తం చేశాడు.

ఈయన ప్రపంచంలోని ప్రముఖ ఆటగాళ్ల జాబితాలో నెంబర్ 12 స్థానంలో కొనసాగుతున్నాడు. మంగళవారం ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నిలో పాల్గొన్న డెనిస్ తొలి రౌండ్‌లో ‘జాన్‌నిక్ సిన్నర్’ మీద పై చేయి సాధించాడు. ఆటలో భాగంగా ఐదో సెట్‌లో టాయ్‌లెట్ విరామ సమయాన్ని సిట్టింగ్ అంపైర్ రద్దు చేశాడు. అయితే, తను వాష్‌రూమ్‌కు వెళ్లాలని కోరగా అంపైర్ అందుకు నిరాకరించాడు. దీంతో అసహనానికి గురైన డెనిస్ పాయింట్లో మూత్రం పోస్తానని లేదా బాటిల్లో పోస్తానని నానా రభస చేశాడు.

Tags:    

Similar News