బ్రహ్మంగారు చెప్పింది నిజమేనా.? మరో వింత.. 10 కోడి పిల్లలకు..
దిశ ప్రతినిధి, వరంగల్ : కొన్ని సందర్భాల్లో జరుగుతున్న ఘటనలను, విషయాలను చూస్తే నిజమేనా అనే అనుభూతి కలుగుతుంది. ఇది ఎలా సాధ్యం అనిపిస్తుంది. అలాంటి ఘటనే ఒకటి భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కొయ్యురులో బొప్పారం సత్తయ్య అనే వ్యక్తి ఓ కోడిని పెంచుకుంటున్నాడు. అయితే, ఆ కోడికి.. పది కోడి పిల్లలు నాలుగు కాళ్లతో జన్మించాయి. ఈ వింతను చూడటానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన జనం ఆ ఊరికి చేరుకుంటున్నారు. కాలజ్ఞానంలో పొతూలూరి వీరబ్రహ్మేంద్రస్వామి […]
దిశ ప్రతినిధి, వరంగల్ : కొన్ని సందర్భాల్లో జరుగుతున్న ఘటనలను, విషయాలను చూస్తే నిజమేనా అనే అనుభూతి కలుగుతుంది. ఇది ఎలా సాధ్యం అనిపిస్తుంది. అలాంటి ఘటనే ఒకటి భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కొయ్యురులో బొప్పారం సత్తయ్య అనే వ్యక్తి ఓ కోడిని పెంచుకుంటున్నాడు. అయితే, ఆ కోడికి.. పది కోడి పిల్లలు నాలుగు కాళ్లతో జన్మించాయి.
ఈ వింతను చూడటానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన జనం ఆ ఊరికి చేరుకుంటున్నారు. కాలజ్ఞానంలో పొతూలూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు చెప్పినట్లుగానే జరుగుతోందని అక్కడి జనం చర్చించుకోవడం విశేషం.