మానేరు నదిలో చిక్కుకున్న టాటా ఏస్

దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ గ్రామ శివార్లలోని మానేరు నదిలో ప్రయాణికులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం చిక్కుకుంది. అది గమనించిన స్థానికులు అందులోని వారిని రక్షించడంతో అందరూ క్షేమంగా భయటపడ్డారు.వివరాల్లోకివెళితే..పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లోని మానేరు నదిపై నిర్మిస్తున్న వంతెన అసంపూర్తిగానే మిగిలిపోయింది. అయితే దాని పక్కనే వాహనాల రాకపోకల కోసం తాత్కాలికంగా మట్టి రహదారిని ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఆ మట్టి రోడ్డు కొట్టుకపోయింది.అది గమనించకుండా […]

Update: 2020-06-12 05:22 GMT

దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ గ్రామ శివార్లలోని మానేరు నదిలో ప్రయాణికులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం చిక్కుకుంది. అది గమనించిన స్థానికులు అందులోని వారిని రక్షించడంతో అందరూ క్షేమంగా భయటపడ్డారు.వివరాల్లోకివెళితే..పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లోని మానేరు నదిపై నిర్మిస్తున్న వంతెన అసంపూర్తిగానే మిగిలిపోయింది. అయితే దాని పక్కనే వాహనాల రాకపోకల కోసం తాత్కాలికంగా మట్టి రహదారిని ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఆ మట్టి రోడ్డు కొట్టుకపోయింది.అది గమనించకుండా ఖమ్మం నుంచి గోదావరిఖనికి వస్తున్న టాటా ఏస్ మానేరులో చిక్కకునిపోయింది. ఆ సమయంలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో వాహనం కొంత దూరం కొట్టుకుపోయింది.చట్టుపక్కల స్థానికులు వెంటనే అప్రమత్తమై ట్రాక్టర్ సాయంతో వాహనాన్ని బయటకు తీశారు. అందులోని ప్రయాణికులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు.

Tags:    

Similar News