తెలంగాణలో ఉష్ణోగ్రతలు అధికం..!
దిశ వెబ్డెస్క్: గత రెండు రోజులుగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. గాలిలో తేమ శాతం తగ్గిపోవడం వల్లే ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని అధికారులు వెల్లడించారు. వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని అన్నారు. గత రెండు రోజుల్లో నల్గొండలో 35.5, ఖమ్మంలో 33.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాజారావు తెలిపారు.