Zomato షాకింగ్ ఆఫర్: ఒక్క రూపాయికే షేరు
Zomato Employees to get 4.66 Crore Shares| ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇటీవల స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలను చూస్తోంది. జొమాటో కంపెనీ ఐపీఓకు వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో కంపెనీలో ఐపీఓకు ముందు పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు, ప్రమోటర్లుగా
ముంబై: Zomato Employees to get 4.66 Crore Shares| ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఇటీవల స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలను చూస్తోంది. జొమాటో కంపెనీ ఐపీఓకు వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో కంపెనీలో ఐపీఓకు ముందు పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు, ప్రమోటర్లుగా ఉన్నవారు లాక్-ఇన్ పీరియడ్ కారణంగా షేర్లను విక్రయిస్తున్నారు. దీంతో వరుస పతనాలతో సమస్యలు ఎదుర్కొంటున్న కంపెనీ నష్టాలను నివారించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కంపెనీ ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్(ఈఎస్ఓపీ) ద్వారా ఫేస్ వాల్యూ రూ. 1తో 4.66 కోట్ల షేర్లను కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి కంపెనీ బోర్డు డైరెక్టర్లు, నామినేషన్, రెమ్యూనరేషన్ కమిటీ ఆమోదించినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
ప్రస్తుత ధర వద్ద ఉద్యోగులకు కేటాయించిన షేర్ల విలువ మొత్తం రూ. 193 కోట్లని జొమాటో ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీ తాజా నిర్ణయంతో బుధవారం జొమాటో షేర్ ధర దాదాపు 6 శాతం లాభపడి రూ. 44 కు పైన ట్రేడయింది. కాగా, ఏడాది లాక్-ఇన్ పీరియడ్ గడువు గత వారం ముగిసిన తర్వాత 600 కోట్లకు పైగా షేర్లు అమ్మకానికి రావడంతో కంపెనీ షేర్ ధర కేవలం రెండు సెషన్లలో ఏకంగా 23 శాతం కుదేలైంది.
ఇది కూడా చదవండి: ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు బంపర్ ఆఫర్: ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్స్