రైలు కిందపడి ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య

దిశ, దేవరకద్ర : రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దేవరకద్ర..latest telugu news

Update: 2022-03-12 17:13 GMT

దిశ, దేవరకద్ర : రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దేవరకద్ర, కౌకుంట్ల రైల్వే స్టేషన్ మధ్యలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చిన్న కారు పాముల గ్రామానికి చెందిన బుడుగు ఠాగూర్(17) మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీ చదువుతున్నాడు. ఈనెల 10వ తేదీన సాయంత్రం హాస్టల్ నుండి వెళ్ళిపోయి శనివారం సాయంత్రం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తనకు చదువు ఇష్టం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ లభించిందని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News