Yoga: గొంతు, నాసిక, చెవి, ముక్కు, నోటి వ్యాధులను నియంత్రించే సింహగర్జన ఆసనం
దిశ, వెబ్ డెస్క్: మొదటగా నేలపై వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత అడుగున్నర దూరంతో రెండు మోకాళ్లను
దిశ, వెబ్ డెస్క్: మొదటగా నేలపై వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత అడుగున్నర దూరంతో రెండు మోకాళ్లను జరపాలి. రెండు అరచేతులు తొడలకు దగ్గరగా మోకాళ్ల మధ్య నేలపై ఆనించాలి. చేతులను నిలువుగా పెట్టి వాటి ఆధారంతో ముందుకి విల్లువలే వంగాలి. ఈ క్రమంలో ముఖ కదలికలు, కళ్ళు, ముక్కు, చెవి పై దృష్టి కేంద్రీకరిస్తూ ముక్కు ద్వారా నెమ్మదిగా గాలి పీల్చుకోవాలి. అలాగే వదిలేటప్పుడు నోటిని తెరిచి నాలుకను సాధ్యమైనంత బయటకు నెడుతూ గొంతు నుంచి 'హా'.. అనే శబ్దం వచ్చేలా గాలిని బయటకు పంపించాలి. ఇలా 5 నుంచి 20 సార్లు సాధన చేసుకోవచ్చు.
ఉపయోగాలు:
* గొంతు, నాసిక, చెవి, ముక్కు, నోటి వ్యాధులను నియంత్రిస్తుంది.
* ఛాతీ, వెన్నెముకలో ఒత్తిడిని తగ్గుతుంది.
* స్వరాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
* నడుము, మెడ, గొంతు కండరాలకు మంచి వ్యాయామం.