ప్రపంచ హోమియోపతి దినోత్సవం

దిశ, ఫీచర్స్: ప్రతి ఏట ఏప్రిల్ 10న 'వరల్డ్ హోమియోపతి డే' నిర్వహిస్తారు. జర్మనీకి చెందిన

Update: 2022-04-10 08:21 GMT

దిశ, ఫీచర్స్: ప్రతి ఏట ఏప్రిల్ 10న 'వరల్డ్ హోమియోపతి డే' నిర్వహిస్తారు. జర్మనీకి చెందిన హోమియోపతి పితామహుడు డాక్టర్ 'క్రిస్టియన్‌ ఫ్రెడ్రిక్‌ సామ్యేల్‌ హనెమన్‌' జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటుండగా.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఈ వైద్య విధానాన్ని ఆయన 1796 లో కనిపెట్టాడు. మలేరియా వ్యాధి నివారణకు సింకోనా బెరడుతో చేసిన మందు వాడతారని తెలుసుకున్న ఫ్రెడ్రిక్.. ఆ బెరడు మలేరియాను ఏ విధంగా నివారిస్తుందో తెలుసుకోవాలనుకున్నాడు. అందుకోసం సింకోనా బెరడుతో కషాయం తయారు చేసుకొని తనతో పాటు అతని స్నేహితుల మీద ప్రయోగాలు జరిపాడు.

ఏ ఔషధమైతే ఆరోగ్యవంతునిలో వ్యాధి లక్షణాలను కలగజేస్తుందో.. ఆ లక్షణాలున్న రోగికి ఈ ఔషధం ఇచ్చినప్పుడు వ్యాధి నయమవుతుందని తెలుసుకున్నాడు. కాగా తన ప్రయోగ ఫలితాలను గురించి 1976లో లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురించడంతో పాటు ఈ నూతన వైద్య విధానికి హోమియోపతి గా నామకరణం చేశాడు. ప్రస్తుతం 66 దేశాల్లో ప్రాచుర్యంలో ఉన్న హోమియోపతి.. వైద్య విధానాల్లో రెండో స్థానంలో ఉండగా భారతదేశ జనాభాలో 38 శాతం ప్రజలు ఈ వైద్యాన్ని పొందుతున్నారు.



Tags:    

Similar News