గంజాయితో సెక్సువల్ ప్లెజర్.. అక్కడ పెడితే భావప్రాప్తి..
దిశ, ఫీచర్స్ : లాస్ ఏంజిల్స్‌కు చెందిన 51ఏళ్ల ఆంటోనియా హాల్‌కు 2007లో గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఇది కాస్తా యోని ప్రాంతంలో అసాధారణమైన నొప్పిని ప్రేరేపించింది. ఆ తర్వాత వెంటనే ఆర్థరైటిస్ ఎటాక్ అయింది..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : లాస్ ఏంజిల్స్‌కు చెందిన 51ఏళ్ల ఆంటోనియా హాల్‌కు 2007లో గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ అయింది. ఇది కాస్తా యోని ప్రాంతంలో అసాధారణమైన నొప్పిని ప్రేరేపించింది. ఆ తర్వాత వెంటనే ఆర్థరైటిస్ ఎటాక్ అయింది. వెన్నెముక, పెల్విక్ కీళ్లలో మంట, నొప్పి వేధిస్తుంటే.. నడిచేందుకు వాకర్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. ఇలా ఉండగానే 2021లో పిత్తాశయ రాళ్లు ఉన్నాయని తెలియడంతో.. శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఈ సమయంలోనే ఆర్థరైటిస్ వల్ల ఆమె తుంటి ఎముకలో క్షీణత ఏర్పడిందని, హిప్ రీప్లేస్‌మెంట్ చేయాలని సూచించబడింది. ఇన్ని రోగాలు, సమస్యలు వెంటాడినా.. తన పాజిటివ్ మైండ్‌సెట్‌ను మాత్రం వదలలేని అంటోంది హాల్. వీటికి చెక్ పెట్టేందుకే ప్రైవేట్ పార్ట్‌లో గంజాయి ఉంచి, ప్రతిరోజూ భావప్రాప్తి పొందడం ప్రారంభించానని తెలిపింది. తద్వారా నొప్పి నుంచి ఉపశమనం పొందడమే కాదు సెక్సువల్ ప్లెజర్ పొందుతున్నానని చెప్పింది.
ప్రస్తుతం సెక్స్ థెరపిస్ట్‌గా మారి ఇతరులకు కూడా ఇలాంటి సలహాలిస్తున్న హాల్.. భావప్రాప్తిని ఓ క్రీడలాగా ఎంజాయ్ చేయాలని సూచిస్తోంది. అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఉద్వేగం చాలా సహాయకారిగా ఉంటుందని, సైన్స్ కూడా ఇదే చెప్తోందని తెలిపింది. కానీ, దురదృష్టవశాత్తూ సమాజంలో ఇది ఇప్పటికీ చెడుగానే మిగిలిపోయిందని అభిప్రాయపడింది. ఉద్వేగం విలువను ఒక సాధనంగా ప్రయత్నించి చూపించేందుకు కృషి చేస్తున్నానని పేర్కొంది. హాల్ ప్రస్తుతం హవాయిలో హ్యాపీనెస్ కోచింగ్ సెంటర్‌ను నడిపిస్తుండగా.. అధిక ఒత్తిడికి లోనైనా లేదా సమాజ ధోరణితో విపరీతంగా బాధపడే వ్యక్తులకు సహాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది.