డబ్బుకు నిప్పుపెట్టిన భర్త..! దీనితో భార్య ఏకంగా పెట్రోల్ బాటిల్‌తో..

దిశ, పాపన్నపేట: భర్త వేధిస్తున్నాడని ఓ వివాహిత పెట్రోల్ బాటిల్‌తో నిరసన వ్యక్తం చేసిన- latest Telugu news

Update: 2022-03-08 15:38 GMT

దిశ, పాపన్నపేట: భర్త వేధిస్తున్నాడని ఓ వివాహిత పెట్రోల్ బాటిల్‌తో నిరసన వ్యక్తం చేసిన ఘటన పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగ్ చౌరస్తాలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. నార్సింగ్ గ్రామానికి చెందిన ఉప్పరి స్వాతికి అదే గ్రామానికి చెందిన యేసురత్నంతో 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా, వీరు గత 10 సంవత్సరాల క్రితం నుండి ఇద్దరు వేరు వేరుగా ఉంటున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా ఏసురత్నం తనను వేధిస్తున్నాడని.. ఉపాధి కోసం నడుపుతున్న టైలరింగ్‌కు వచ్చిన డబ్బుకు నిప్పు అంటించాడని బాధితురాలు ఆరోపించింది. ఈ విషయమై ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదంటూ నార్సింగ్ చౌరస్తా వద్ద పెట్రోల్ బాటిల్‌తో నిరసన వ్యక్తం చేసింది. సమాచారం తెలుసుకున్న పాపన్నపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News