Beer bottles: బీర్ బాటిల్స్ ఈ కలర్స్‌లోనే ఉండటానికి కారణమిదే..?

మద్యపానం ఆరోగ్యానికి హానికరమని.. మద్యం సీసాపైనే రాసి ఉంటుంది.

Update: 2024-12-15 14:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: మద్యపానం(Alcohol) ఆరోగ్యానికి హానికరమని.. మద్యం సీసాపైనే రాసి ఉంటుంది. అలాగే థియేటర్లలో మూవీ పడే ముందు కూడా మద్యపానం, ధూమపానం(smoking) ఆరోగ్యానికి హాని అని చెబుతుంటారు. అయినప్పటికీ ప్రస్తుత రోజుల్లో పలువురు జనాలు మద్యానికి విపరీతంగా బానిసవుతున్నారు. బీర్(Beer) అమ్మకాలు పెరగడమే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. అయితే ప్రతి ఏటా వింటర్‌(Winter)లో బీర్ల అమ్మకాలు తగ్గుతాయి. కానీ ఈ ఏడాది మాత్రం గతంతో పోల్చితే.. 33 శాతం బీర్ల అమ్మకాలు పెరిగాయి. అయితే బీర్ బాటిల్స్‌లో కూడా సైన్స్ దాగుందని తాజాగా నిపుణులు వివరిస్తున్నారు. కామన్‌గా బీర్ బాటిల్స్ రెండు కలర్స్‌లో ఉంటాయన్న విషయం తెలిసిందే. ఒకటి గ్రీన్(Green).. మరొటి.. గ్రే కలర్(Gray color). ఇవి రెండు రంగులు మాత్రమే ఉండటానికి కారణమేంటని జనాల్లో తలెత్తిన ప్రశ్నకు సమాధానమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కొన్నేళ్ల కిందట పలు దేశాల్లో ట్రాన్స్‌పరెంట్(Transparent) సీసాల్ని బీర్ కోసం వాడేవారట. ఈ బీర్ బాటిల్స్ పై ఎండ పడి.. కిరణాల కారణంగా లోపల బీర్ రసాయన సమ్మేళనాన్ని(chemical compound) ఫాస్ట్‌గా మార్చినట్లు గుర్తించారు. దీనివల్ల బీర్ టేస్ట్ మారిపోతుంది. అంతేకాకుండా ఆ బీర్ ఎవరైతే తాగారో వారు అస్వస్థకు గురయ్యారు. దీంతో బీర్ బాటిళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుని.. సన్‌లైట్ రిఫ్లెక్ట్(Reflect sunlight) అయ్యేలా సన్ గ్లాస్ టెక్నాలజీ(Sunglass technology)ని వాడారు. ఇక అప్పటి నుంచి బీర్ బాటిల్స్‌ను గ్రీన్, గ్రే కలర్‌లోనే తయారుచేస్తున్నారట. రెండో ప్రపంచ యుద్ధం(Second World War) అప్పుడు గోధుమ కలర్ బీర్ బాటిల్‌(Brown colored beer bottle)ను ఉపయోగించారట. ఇందులో నిల్వ ఉంచిన బీర్ కూడా పాడవ్వకుండా ఉందట.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Read More...

Alcohol: లిమిట్‌లో తీసుకున్నా వాంతులు అవుతున్నాయా..?



Similar News