Ding Liren : డింగ్ లిరెన్‌పై ఆరోపణలను ఖండించిన ఫైడ్

ఆటల్లో పొరపాట్లు కామన్ అని అంతర్జాతీయ చెస్ సమాఖ్య తెలిపింది.

Update: 2024-12-15 17:04 GMT

దిశ, స్పోర్ట్స్ : ఆటల్లో పొరపాట్లు కామన్ అని అంతర్జాతీయ చెస్ సమాఖ్య తెలిపింది. డింగ్ లిరెన్‌పై రష్యా చెస్ సమాఖ్య చేసిన ఆరోపణలపై ఆదివారం ఫైడ్ స్పందించింది. అంతర్జాతీయ చెస్ చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌లో లింగ్ లిరెన్ ఉద్దేశపూర్వకంగా ఓడిపోయినట్లు చేసిన ఆరోపణలను ఫైడ్ చీఫ్ అర్కడీ డ్వొర్కొవిచ్ తీవ్రంగా ఖండించారు. ‘ఆటల్లో తప్పులు చేయడం మళ్లీ బౌన్స్ బ్యాక్ కావడం జరుగుతుంటుంది. ఆటల్లో పొరపాట్లు కామన్. తప్పులు చేయకుంటే ఫుట్‌బాల్‌లో గోల్స్ ఎలా అవుతాయి. ప్రతి ఆటగాడు తప్పులు చేస్తాడు. ప్రత్యర్థి ఆటగాళ్ల తప్పులను వినియోగించుకోవడమే ఆటగాడి లక్షణం.’ అన్నాడు. అయితే చివరి గేమ్‌లో లిరెన్ ఉద్దేశపూర్వకంగానే తప్పు చేశాడేమో అని రష్యా చెస్ ఫెడరేషన్ చీఫ్ ఆండ్రీ ఫిలటోవ్ అనుమానాలు వ్యక్తం చేశాడు. లిరెన్ ఉన్న స్థితిలో ఓడిపోవడం సాధ్యం కాదన్నాడు. దీనిపై అంతర్జాతీయ చెస్ సమాఖ్య విచారణ జరపాలని డిమాండ్ చేశాడు. చివరి మ్యాచ్‌లో డింగ్ లిరెన్‌పై గెలిచి గుకేష్ వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News