సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత ముంబై.. రెండోసారి టైటిల్ కైవసం

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీ టైటిల్‌ను ముంబై కైవసం చేసుకుంది.

Update: 2024-12-15 15:24 GMT

దిశ, స్పోర్ట్స్ : సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీ టైటిల్‌ను ముంబై కైవసం చేసుకుంది. ఫైనల్‌లో మధ్యప్రదేశ్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచింది. 2022లో తొలిసారి విజేతగా నిలిచిన ముంబైకి ఇది రెండో టైటిల్. మరోసారి మధ్యప్రదేశ్‌కు నిరాశే ఎదురైంది. బెంగళూరులో ఆదివారం జరిగిన ఫైనల్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 174/8 స్కోరు చేసింది. కెప్టెన్ రజత్ పటిదార్(81 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మంచి స్కోరు అందించాడు. అయితే, ముంబై లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. సూర్యన్ష్ షెడ్గే(36 నాటౌట్) మెరుపులతో విజయం తేలికవ్వగా.. సూర్యకుమార్(48), అజింక్యా రహానే(37) రాణించారు. సూర్యన్ష్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా..టోర్నీలో 469 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచిన రహానే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.


Tags:    

Similar News