ఏంటి.. అమితాబ్ బచ్చన్‌కు పూజాహెగ్డే మనవరాలు అవుతుందా..? ఆ బంధుత్వం ఎలా కలిసిందంటే..?

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-10-14 13:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక లైలా కోసం, ముకుందా, దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, సాక్ష్యం, అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఆచార్య వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక అల వైకుంఠపురములో మూవీలోని బుట్టబొమ్మ సాంగ్‌తో ఈ అమ్మడు గ్రాఫ్ అంతా మారిపోయింది. దీంతో అందరూ వరుస ఆఫర్లు క్యూ కడతాయి అనుకున్నారు. కానీ, ఈ బ్యూటీకి అనుకున్నంత రేంజ్‌లో ఆఫర్లు అయితే రాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పింది. కానీ, సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. అలాగే పలు యాడ్స్‌లోనూ మెరుస్తోంది. ఈ క్రమంలో ఈ భామ బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు మనవరాలు అవుతుందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏంటి నిజమా అంటే.. నిజమనే చెప్పాలి. కానీ ఇక్కడ ఓ ట్విస్ట్ ఉందండోయ్. అదేంటంటే..

ప్రస్తుతం పూజా హెగ్డే, బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కలిసి మాజా కూల్ డ్రింక్‌కు యాడ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటనలో బుట్ట బొమ్మ మనవరాలిగా, అమితాబ్ బచ్చన్ తాతయ్యగా నటిస్తున్నారు. అయితే ఈ విషయం తెలియక చాలా మంది పూజా హెగ్డే అమితాబ్ బచ్చన్ మనవరాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తీరా అసలు విషయం తెలిశాక నోరెళ్లబెడుతున్నారు.


Similar News