Mechanic Rocky Twitter Review: విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’.

Update: 2024-11-22 13:15 GMT

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’. ఈ సినిమాకు రవితేజ ముళ్ళపూడి(Ravi Teja Mullapudi) దర్శకత్వం వహించగా.. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్(SRT Entertainments) బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. అయితే ఇందులో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఇందులోంచి విడుదలైన అన్ని అప్డేట్స్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. నేడు ‘మెకానిక్ రాకీ’(Mechanic Rocky) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే అన్ని చోట్ల ఫస్ట్ షో పడిపోయింది.

ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. ‘సినిమా బోరింగ్. ఎంటర్‌టైన్‌మెంట్ కూడా లేకపోవడం వల్ల పెద్దగా బాగోలేదు. స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు. మొత్తంగా చాలా సాదాసీదా మూవీ ఇది. పెద్దగా కాన్సెప్ట్ ఏమీ లేదు’ అని ఓ నెటిజన్ రాయగా.. సాంగ్స్ ఫర్వాలేదని అనిపించాయి అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. కథనం, నవ్వురాని కామెడీతో మొత్తానికి ఈ సినిమా నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.


Click Here For Twitter Post.. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..