Allu Arjun: అల్లు అర్జున్‌‌కు వ్యతిరేకంగా టాలీవుడ్ కమెడియన్..! షాకింగ్ ట్వీట్ వైరల్

గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్(Allu Arjun) పేరు మార్మోగిపోతోంది.

Update: 2024-12-23 03:46 GMT

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అల్లు అర్జున్(Allu Arjun) పేరు మార్మోగిపోతోంది. ఆయన తీవ్రమైన వివాదాన్ని ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్నారు. అయితే సంధ్య థియేటర్ ఘనటలో ఆయన తప్పు ఉందని ఇటీవల  కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఈ వివాదం జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. దీంతో సినీ సెలబ్రిటీలు అంతా ఐకాన్ స్టార్‌కు సపోర్ట్‌గా నిలిచారు. ఈ క్రమంలో.. నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna)కూడా పోలీసులపై ఫైర్ అయిన విషయం తెలిసిందే.

ఇటీవల ఇదే ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. తన తప్పు లేదని అన్నారు. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna) ఓ సెన్సేషనల్ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు.

అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో ఆయనకు సపోర్ట్‌గా మాట్లాడి.. ఇప్పుడు తాను చెప్పిన మాటలు వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించి షాకిచ్చాడు. ‘‘జరిగిన సంఘటనపై నాకు చాలా తప్పుడు సమాచారం అందింది. అందుకే నేను చేసిన కామెంట్లను వెనక్కి తీసుకుంటున్నాను’’ అని రాసుకొచ్చాడు. అప్పుడు అల్లు అర్జున్‌కి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని కొశ్చన్ చేశారు. కానీ ఇప్పుడు సడెన్‌గా ఇలా సైడ్ మారిపోవడంతో చాలా మంది నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఇండస్ట్రీ వైపు కాకుండా న్యాయం వైపు సపోర్ట్‌గా నిల్చున్నావు గ్రేట్ అని అంటున్నారు. అయితే రాహుల్ రామకృష్ణ పెట్టిన పోస్ట్ అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా ఉండటంతో.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News