Allu Arjun: అల్లు అర్జున్ కొంపముంచిన ఆ ఒక్క వీడియో?
పోలీసులకు వ్యతిరేకంగా అల్లు అర్జున్ అబద్ధాలు చెప్పడాన్ని సామాన్యులు కూడా తప్పుబడుతున్నారు.
దిశ, వెబ్ డెస్క్ : గత కొంత కాలం నుంచి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో వివాదాలు తలెత్తుతున్నాయి. ఒక దాని తర్వాత ఇంకోటి రెడీ అవుతుంది. రాజ్ తరుణ్, జానీ మాస్టర్, హర్ష సాయి, మొన్నటికి మొన్న మోహన్ బాబు ఇంటి గొడవలు ఇక ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2 ఘటన.
ఈ మూవీ రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడం, ఓ బాబు కోమాలోకి వెళ్లడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. రెండు రోజుల క్రిత్రం అసెంబ్లీలో దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ పై, సినీ ఇండస్ట్రీపై మండిపడ్డారు.
ఒక్క వీడియో అల్లు అర్జున్ మాటల్లో నిజం లేదని తేల్చిందా?
అల్లు అర్జున్ డిసెంబర్ 21న రాత్రి 8 గంటలకు తన నివాసం వద్ద ప్రెస్ మీట్ పెట్టి.. సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనలో తన తప్పు లేదని చెప్పుకొచ్చాడు. అంతే కాదు మూవీ చూసేటప్పుడు.. తన వడ్డలు అసలు పోలీసులే రాలేదని అన్నారు. కానీ, ఆయన చెప్పిన మాట్లాడాలన్నీ అబద్ధమని నిరూపిస్తూ.. పోలీసులు ఓ వీడియో సాక్ష్యాధారాలతో సహా బయటకు విడుదల చేశారు. ఇలా పోలీసులకు వ్యతిరేకంగా అల్లు అర్జున్ అబద్ధాలు చెప్పడాన్ని సామాన్యులు కూడా తప్పుబడుతున్నారు. ఒక స్టార్ హీరో అయి ఉండి ఇలా ఎలా మాట్లాడుతున్నావ్ అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.