బాలకృష్ణ సినిమా ఫంక్షన్‌లో చిరంజీవి సినిమాపై నిర్మాత నాగవంశీ హాట్ కామెంట్స్
నందమూరి బాలకృష్ణ(Balakrishna), బాబీ కొల్లి కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj).
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna), బాబీ కొల్లి కాంబినేషన్‌లో రాబోతున్న మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Surya Devaranaga Vamsi), సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఇందులో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) హీరోయిన్‌గా నటిస్తుండగా.. భారీ అంచనాల మధ్య జనవరి 12న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ హైప్ పెంచుతున్నారు. అలాగే పలు ఈవెంట్స్ నిర్వహించి అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఈ మూవీ విడుదలకు నెల ఉండగానే ప్రీ-రిలీజ్ ఈవెంట్(Pre-release event) జనవరి 4న అమెరికాలో జరగబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ‘డాకు మహారాజ్’ ప్రెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో నిర్మాత నాగవంశీ హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ‘‘చిరంజీవి(Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’ కంటే బాలయ్య ‘డాకు మహారాజ్’ సినిమాను బాబీ బాగా తెరకెక్కించారు. ఈ విషయంలో చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదు కానీ అది నిజం. అయితే ఈ మూవీ గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు ‘డాకు మహారాజ్’ కూడా విజయం సాధిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. దీంతో మెగా ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అలాగే పలు పోస్టులు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.
#NagaVamsi #DaakuMaharaaj pic.twitter.com/aVIUm0sOkP
— Fukkard (@Fukkard) December 23, 2024