Naga Vamshi: ‘డాకు మహారాజ్’ ప్రమోషన్లు జరిగేది అక్కడే.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నందమూరి బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaj ).

Update: 2024-12-23 08:26 GMT

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaj ). ప్రగ్యా జైశ్వాల్(Pragya Jaiswal) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్ మూవీ పై భారీ అంచనాలను పెంచాయి. అయితే ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడతంతో మూవీ టీమ్ ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను చాలా గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

వాటికి సంబంధించిన అప్డేట్ ఇస్తూ నిర్మాత నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా నిర్వ‌హించిన ప్రెస్‌మీట్‌లో నాగ‌వంశీ మాట్లాడుతూ.. 'జ‌న‌వ‌రి 2న ఈ చిత్ర ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌(Hyderabad)లో నిర్వ‌హిస్తున్నాము. ఇక జ‌న‌వ‌రి 4న అమెరికా(America)లో ఓ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌నున్నాము, అక్క‌డ ఓ సాంగ్‌ను కూడా రిలీజ్ చేస్తాము. అలాగే జ‌న‌వ‌రి 8న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌(Andhrapradesh)లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌(Pre Release Event)ను నిర్వ‌హించేందుకు సన్నాహాలు చేస్తున్న‌ాము' అని నాగవంశీ వెల్ల‌డించారు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయి.

Tags:    

Similar News